ఓ ఎలుక ఇల్లును కాలబెట్టింది. అంతేకాదు ఆ ఇంటిలో ఉన్న రూ. 2లక్షల నగదు కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే: గుజరాత్ లోని హత్కేశ్వర్ ప్రాంతంలోని వినోద్ అనే వ్యాపారి ఇల్లు ఓ ఎలుక వల్ల పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న ఓ దీపాన్ని ఎలుక కిందపడేయడంతో మంటలంటుకున్నాయి. ఆ తర్వాత భారీగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే, అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు కూడా కాలి బూడిదైంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.