వరంగల్ జిల్లాలో ఇంటర్ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా నడుచుకుంటున్నారు. ఇంటర్ జవాబు పత్రాలను ఇంటికి తీసుకెళ్లి వాల్యుయేషన్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. హన్మకొండలోని ఇంటర్ వాల్యుయేషన్ సెంటర్ నుంచి ఎవరికి వారే జవాబు పత్రాలను దర్జాగా ఇంటికి తీసుకెళ్తున్నారు. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు సైలెంట్ గా ఉన్నారు. నిబంధనల ప్రకారం జవాబు పత్రాల వాల్యుయేషన్ సం టర్ లోనే జరగాలి. కానీ నిబంధనలకు విరుద్దంగా అధికారులు వెళ్తున్నారు. ఆన్సర్ షీట్స్ ను ఇంటికి తీసుకెళ్లి పోతున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి తీసుకెళ్లి వారికి ఇష్టం వచ్చినప్పుడు వాల్యుయేషన్ చెయ్యడాన్ని తప్పుపడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు…