- సిటిలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం.
- భారీ ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు.
మార్చి 7న వరంగల్ పర్యటనకు వస్తున్న రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహాక అద్యక్షులు గౌ.శ్రీ.కల్వకుంట్ల తారకరామారావు గారి పర్యటనను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఈనెల 7న ఉదయం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తలతో సన్నాహాక సమావేశంలో పాల్గొనేందుకు వరంగల్ నగరానికి వస్తున్నారు. కేటిఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు హన్మకొండలోని రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లితో పాటు, మాజీ డిప్యూటి సియం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరెందర్, దాస్యం వినయ్‌భాస్కర్, డా.టి.రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ గద్దల పద్మ, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టివివి చైర్మన్ వాసుదేవరెడ్డి, పార్టీ నాయకులు మార్నేని రవింధర్‌రావు, బీరెల్లి భరత్ కుమార్, ధర్మరాజు తధితరులు పాల్గొన్నారు. భారీ ఘనస్వాగతం పలకడానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 3 వేల మంది ముఖ్యకార్యకర్తలు హజరయ్యే విధంగా చూడాలన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది, స్వాగతం తోరణాలు ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన కమిటీలను వేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు.