తేదీ 11.09.2019 సాయంత్రం 3 గంటల నుండి తేదీ 12.09.2019 ఉదయం 10 గంటల వరకు భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు.

 1. ములుగు భూపాలపల్లి వైపు నుండి వచ్చు భారీ వాహనాలు సైలాని బాబా దర్గా వద్ద పార్కింగ్ ప్లేస్ లో నిమజ్జనం అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
 2. ఖమ్మం వైపు నుండి వచ్చు భారీ వాహనాలు నాయిడు పంప్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో నిమజ్జనం అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
 3. నర్సంపేట వైపు నుండి వచ్చు భారీ వాహనాలు గొర్రెకుంట క్రాస్ రోడ్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో నిమజ్జనం అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
 4. హైదరాబాద్ వైపు నుండి వచ్చు భారీ వాహనాలు రాంపుర్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో నిమజ్జనం అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
 5. కరీంనగర్ వైపు నుండి వచ్చు భారీ వాహనాలు బావుపేట క్రాస్ రోడ్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో నిమజ్జనం అయిపోయేంతవరకు ఆపుకోవాలి.

వరంగల్ సిటి లో తిరుగు వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు:

 1. ములుగు మరియు పరకాల వైపు నుండి వచ్చే బస్సులను వయా పెద్దమ్మగడ్డ నుండి కె. యు. సి., సి‌పి‌ఓ, అంబేడ్కర్ సెంటర్, శ్రీదేవి ఏసియన్ మాల్ మీదుగా బస్టాండ్ కు చేరుకోవాల్సి వుంటుంది.
 2. హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరు ములుగు వైపు కరీంనగర్ వైపు వేళ్ళు బస్సులను వయా శ్రీదేవి టాకీస్ మీదుగా C.P.O. ద్వారా KUC జంక్షన్ మీదుగా వెళ్లవలెను.
 3. హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరు నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రురు, ఖమ్మం వేళ్ళు బస్సులు వయా బాలసముద్రం, అదాలత్ మీదుగా హంటర్ రోడ్ ద్వారా రంగశాయిపేట మీదుగా చింతల బ్రిడ్జి ద్వారా వెళ్లవలెను.
 4. వరంగల్ బస్టాండ్ నుండి బయలుదేరు హన్మకొండ వైపు వచ్చు బస్సులు చింతల్ బ్రిడ్జి నుండి రంగశాయిపేట్ మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సు గుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ ద్వారా హన్మకొండ కు రావాలి.
 5. చిన్న చిన్న వినాయక విగ్రహాలు ( ఇంట్లో పెట్టుకున్నవి ) మాత్రమే పద్మాక్షిగుండుములో నిమజ్జనం చేయవలెను మరియు వినాయక నిమజ్జనం చేసుకున్న వాహనాలను పద్మాక్షి గుట్ట నుండి శాయంపేట వైపు వెళ్లే రోడ్ ద్వారా వెళ్లవలెను. పద్మాక్షమ్మ గుండం లో నీటి స్థాయి చాలా తక్కువగా వున్నందున ఈ గుండం లో కేవలం 5 అడుగుల లోపు వున్న విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాల్సి వుంటుంది.
 6. శాయంపేట నుండి వినాయక విగ్రహాలను వయా హంటర్ రోడ్, అదాలత్, హన్మకొండ, ములుగు రోడ్, ఆటో నగర్ మీదుగా కోట చెరువు కు వెళ్లవలెను.
 7. శాయంపేట నుండి పద్మాక్షి రోడ్ ద్వారా వినాయక విగ్రహాలను మరియు ఎలాంటి వాహనాలను అనుమతించబడవు.
 8. గోపాలాపూర్, భీమారం మరియు రామారం గ్రామాలకు సంబందించిన వినాయక విగ్రహాలు అన్ని నిమజ్జనానికి హాసనపర్తి కి వెళ్లవలెను.
 9. Excise కాలనీ, రెవిన్యూ కాలనీ మరియు వడ్డేపల్లి కి సంబందించిన వినాయక విగ్రహాలుఅన్ని బంధం చెరువు లో నిమజ్జనం చేయవలెను.
 10. చిన్నవడ్డేపల్లి చెరువు లో నిమజ్జనం చేసిన వాహానాములు ఎనుమాముల రోడ్ నుండి నర్సంపేట రోడ్ కు వెళ్లవలెను.
 11. కోట చెరువు లో నిమజ్జనం కై వెళ్లే వాహానాములు ములుగు రోడ్ జంక్షన్, ఆటో నగర్ మీదుగా వెళ్లవలెను.
 12. ములుగు రోడ్ నుండి హనుమాన్ జంక్షన్ ద్వారా కోట చెరువునకు వన్ వే చేయబడినందున నిమజ్జనానికి వెళ్ళుటకు వాహానాములకు అనుమతించబడవు. కోట చెరువులో నిమజ్జనం తర్వాత వాహనాలు పెద్దమ్మగడ్డ, కే‌యూ‌సి జంక్షన్ మీదుగా వెళ్లవలసి వుంటుంది.
 13. సిటీ బస్సులు నిమజ్జన సమయములో కాజిపేట, వరంగల్ మెయిన్ రోడ్ లో నడపబడవు.