ఈవీఎం పై ఓటు ఒత్తితే కాంగ్రేస్ ఖమ్మం పోవాలే.. టీజేఎస్ ఘనపూర్ పోవాలె… వీళ్ళను పంపినోడు పరకాల బార్డర్ దాటద్దు..

తెలంగాణా పై అక్కడ చంద్రబాబు పెత్తనాన్ని మనపై రుద్దడానికి కాంగ్రేస్ చూస్తుంది. ఇక్కడ తూర్పు నియోజకవర్గంపై కనీస అవగాహన లేని ఖమ్మం అతని పెత్తనాన్ని మనపై రుద్దేందుకు ఇక్కడనుండి పారిపోయినోళ్ళు,పనిచేయలేనోళ్ళు చూస్తున్నరు..మోసపోతే గోసపడ్తం..ఆగంగావద్దు ఆలోచన చేయాలే..నిర్ణయం మంచిగ తీసుకోవాలె..మీరు తీసుకునే నిర్ణయం రేపటి తూర్పు అభివృద్దికి వెలుగురేఖ కావాలి..

ఇక్కడ గత ఎమ్మెల్యే అంటుంది మేయర్ అభివృద్ది చేయలేదని అసలు గత తూర్పు ఎమ్మెల్యే ఎవరు..? అభివృద్ది ఎందుకు జరగలేదు..?నాలుగున్నరేండ్లు ఆమె వాళ్ళ సారు ఏంజేసిండ్రు..? అంటే ఆమె ఏం చేయలేదని ఒప్పుకున్నట్టేనా..? మీరే ఏం చేయలేదు..మీషాడో ఏం చేస్తాడు..అభివృద్ది చేసి సొంత గడ్డను బాగుచేద్దామని అనుకున్న నరేందర్ కు అడుగడుగునా అడ్డం పడ్డారు..వాళ్ళు చేసిందొక్కటే ప్రజలతో కాళ్ళు మొక్కిచ్చుకునుడు,బాంబులు పేల్పిచ్చుకునుడు,చిడతల భజన,మీసాలు తిప్పుడు..ఇది తప్ప వారు చేసిందేంది..హన్మకొండలో జరిగిన అభివృద్ది చూడండి అక్కడ జరిగి ఇక్కడ జరగలేదంటే లోపం ఎమ్మెల్యేదా..?మేయర్ దా..?

ఆలోచించండి..పనిచేయలేదు ఇక్కడ నిలబడితే ఓడిపోతామనే ఇక్కడనుండి వెల్లిన వారి వారి పెత్తనాన్ని వారి షాడో రూపంలో రుద్దేందుకు వస్తున్నారు..

స్థానిక నాయకుడు,మురికివాడలో పుట్టి పెరిగిన వ్యక్తి,ఈ ప్రాంత సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి,పేదింటి నుండి వచ్చిన వాడు ”బిల్ రైటర్ నుండి మేయర్ వరకు అన్ని మెట్లలో కష్ట సుఖాలతో సావాసం చేసిన వాడు,మృత్యువును జయించి ప్రజాసేవలో ఉన్నవాడు నన్నపునేని నరేందర్..ఇక్కడ ఏ గల్లీ ఎక్కడుంది,ఎవరి స్థితిగతులేంటి,ఇక్కడి ప్రజల జీవణ ప్రమాణాలు,పరిస్థితులపై స్పష్టమైన అవగాహణ ,నిర్ధిష్టమైన ప్రణాళిక ఉన్న వ్యక్తి నరేందర్ ను గెలిపిస్తే ఇక్కడే ఉంటాడు అభివృద్ది చేస్తాడు.అలాగే నరేందర్ అందరికి సుపరిచితుడు..అన్నా,తమ్ముడు,బాబాయ్,మామా,చిచ్చా,అమ్మా,చిన్నమ్మ,పెద్దమ్మ,అక్కా అంటూ అందరిని వరుసలు పెట్టి పిలుచుకునేవారు..ఈ ప్రాంత బిడ్డ అతనికి ప్రజలకు మద్య వారదులు లేవు నేరుగా అతన్ని కలవొచ్చు..అండర బ్రిడ్జ్ దగ్గర అతని ఇల్లు అందరికి అందుబాటులో ఉంటాడు అర్ధరాత్రి ఆపదొచ్చినా ఆదుకుంటాడు..

స్థానికుడైన నరేందర్ వైపు నిలబడదామా..?మనపై పెత్తనం చూపేందుకు వస్తున్న షాడోల వైపు నిలబడదామా..?

తూర్పు ప్రజలు ఆలోచించాలి..ఇదో ఆత్మగౌరవ సమస్య..?బానిసలుగా చేసి మన మనోబావాలు దెబ్బతీసిన వాళ్ళకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది..తూర్పు ఆత్మగౌరవ ప్రతీకను ఎగరేసేందుకు సమయం ఆసన్నమైంది..గ్రానైట్ వ్యాపారికి ఘనమైన ఓటమినందించే అవసరం ఎంతైనా ఉంది..

ఎక్కడనుండో వచ్చినోన్ని గెలిపించి బానిసలుగా ఉందామా..?
ఇక్కడే ఉండే మన బిడ్డ నరేందర్ ను గెలిపించి బాస్ లుగా ఉందామా..?