నిహారిక పెళ్లి విషయమై నాగబాబు మాట్లాడుతూ ‘‘నేను తనకి ముందే చెప్పాను. రెండు, మూడేళ్లలో నీకు పెళ్లి చేస్తాను. ఏదో నీ కోరిక తీర్చడానికి నటించేందుకు ఒప్పుకున్నాను తప్ప.. వెబ్ సిరీస్ ఉన్నాయి కదా వాటిల్లో చేసుకో నువ్వు అని చెప్తే తను కూడా సరే అంది. బయట నుంచి సంబంధాలు వెతుకుతున్నాం. త్వరలో పెళ్లి చేసేస్తాం. నిహారికకు 2018 వరకూ టైమ్ ఇచ్చా. సంబంధాలు వస్తే పెళ్లి చేసెయ్యడానికి రెడీగా ఉన్నా. ముఖ్యంగా మంచి వ్యక్తి, పద్ధతైన వ్యక్తి అయి ఉండాలి. నాకు అంత క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉండదు. నా కాపు కులాన్ని గౌరవిస్తాను. అలాగే అన్ని కులాలనూ గౌరవిస్తాను. నాకు కులంతో సంబంధం లేదు. మంచి వ్యక్తి.. తల్లిదండ్రులు మంచి వారైతే చాలు. మా కాపు కులంలో మంచి అబ్బాయి దొరికితే మంచిదే. దొరక్కపోయినా వేరే కులంలో తన కాళ్లపై తాను నిలబడితే చేసేందుకు నేను రెడీ’’ అని నాగబాబు చెప్పుకొచ్చారు….