Advertisement

SP. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్ గారు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం ముందర ఈ-చలాన్ వ్యవస్థను లాంచనంగా ప్రారంభించినారు.

ఈ సందర్బంగా ఎస్.పి గారు మాట్లాడుతూ…. జిల్లా లో నేటి నుండి ట్రాఫిక్ ను నియంత్రించుటకు ప్రజలను ప్రమాదాల నుండి కాపాడుటకు e-challans అనే కొత్త వ్యవస్థ ద్వారా జరిమానాలు విధించే పద్ధతిని అనుసరించడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపినారు. ఈ చాలన్స్ ద్వారా రెండు పద్దతులలో జరిమానాలు విధించడం జరుగుతుందని అందులో కాంటాక్ట్ పద్ధతి లో ట్రాఫిక్ నియమాలను అతిక్రమించి వాహన దారులను భౌతికంగా అపి వాహన నంబర్స్ ను TAB లో నిక్షిప్తం చేసి ఈ టికెట్ ఇవ్వడం జరుగుతుందని అలా జారీచేసిన e-ticket లు (3) మించినట్లైతేనే RC/DL/VEHICLE ను గుర్తించి అతనికి అనువైన ఏదేని gateways ద్వారా చెల్లించిన తరువాతే వాహనాన్ని విడుదల చేయటం జరుగుతుంది.

వీడియో & ఫోటో (video footage & photograph) లను కెమెరాల ద్వారా, ట్రాఫిక్ కమాండ్ సెంటర్ (TCC) పరిధిలో ఉల్లంగనలను చిత్రీకరించి అట్టి డేటా ను TCC నందు గల సర్వర్ (SERVER) లొ భద్రపరిచి తగు సాక్ష్యాదారాలతో E-CHALLAN లను వాహనధారుని ఇంటికి పంపటం జరుగుతుంది అని అన్నారు..