ఈ షాపును గత నెల 1న ప్రారంభించారు. రోజుకు కనీసం ఓ వెయ్యి రూపాయల దాకా ఆదాయం వస్తుందట ఆ షాప్ వల్ల. ఆ ప్రాంత వాసులు కూడా ఆ షాప్‌కు అలవాటు పడిపోయారు. తమకు కావాల్సిన వస్తువులను తీసుకొని డబ్బులను బాక్స్‌లో వేసి వెళ్తారు. ఇప్పటి వరకైతే ఆ షాపు నుంచి ఎవరూ వస్తువులను ఎత్తుకెళ్లలేదట. ఈ షాప్ సూపర్ సక్సెస్ కావడంతో కన్నూర్ పరిధిలో మరికొన్ని షాపులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ట్రస్ట్.