సివిల్స్ ఫలితాల్లో ఈమె 71వ ర్యాంకు సాధించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి రెడ్డి నాగభూషణ్‌రావు, రెడ్డి శాంతి కుమార్తె వేదితా రెడ్డి. తల్లి స్వస్థలం శ్రీకాకుళం, తండ్రి స్వస్థలం విజయనగరం. ఉత్తరాంధ్ర వెనకబాటుతనమే వేదితను సివిల్స్ వైపు అడుగులు వేసేలా చేసింది. దాద్రానగర్‌లో ఆరో తరగతి వరకు చదివిన వేదిత ఏడో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఢిల్లీలోని సంస్కృతి పాఠశాలలో చదివారు. నోయిడాలో 2013లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ పూర్తిచేసి తొలిసారి సివిల్స్ రాసినా ఆశించిన ర్యాంకు రాలేదు.

ఈ లక్ష్యం కోసం ప‌నిచేస్తా:

నేరుగా ఐఏఎస్ దక్కడం ఆనందంగా ఉంది. నాకు అమ్మానాన్నలే స్ఫూర్తి. ఏపీ క్యాడర్‌కే మొదటి ఆప్షన్ ఇచ్చా. రాష్ట్రంలో మా ప్రాంతం చాలా వెనకబాటుకు గురైంది. మహిళల సాధికారత లక్ష్యంగా పనిచేయాల్సి ఉంది. పూర్తిస్థాయి సంతృప్తి ఉంటుంద నే సివిల్స్ లక్ష్యంగా చదివా’’ అని వేదితా రెడ్డి పేర్కొన్నారు.

న‌న్ను కదిలించిన స‌మ‌స్య‌లు ఇవే:

శ్రీకాకుళం జిల్లాలో నలుమూలలా పర్యటించాను చాలా సమస్యలు కదిలించాయి వాటిని పరిష్కరించాలంటే ఐఏఎస్ ఒక్కటే మార్గం అందుకే పక్కా ప్రణాళిక, లక్ష్యంతో చదివాను విజేతగా నిలిచా. మహిళలను ప్రొత్సహిస్తే అబ్దుతాలే వేదితా రెడ్డి వెల్లడించారు.

నా ల‌క్ష్యానికి మార్గం:

సివిల్స్ దేశంలో అత్యున్నత సర్వీస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షకు ఎంతో డిమాండ్ ఉంది. దేశంలో అత్యుత్తమ ఉద్యోగాలు ఈ సర్వీస్‌తోనే సాధ్యం. ప్రజలకు నేరుగా సేవచేసే భాగ్యం దక్కుతుంది. అందుకే చాలామంది యువత సివిల్స్‌లో మెరుగైన ర్యాంకు సాధన కోసం తాపత్రయపడతారు. రాత్రీపగలు శ్రమిస్తారు. రూ.లక్షల్లో వేతనాలు తీసుకున్న వారు సైతం ఉద్యోగాలు విడిచిపెట్టి సివిల్స్ సాధనకోసం తపిస్తారు. నాకు మాత్రం శ్రీకాకుళం జిల్లాలోని సమస్యలే కదిలించాయి. ఐఏఎస్ సాధనకు ప్రేరణ ఇచ్చాయి. అమ్మ (వైఎస్సార్ సీసీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి) ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారం కోసం జిల్లా నలుమూలలా తిరిగాను. ప్రజలు సమస్యలు తెలుసుకున్నాను. వారి జీవనాన్ని దగ్గరగా పరిశీలించాను. అలాంటి వారికి ప్రత్యక్షంగా సేవచేయాలంటే ఐఏఎస్ ఒక్కటే మార్గం అనిపించింది. అందుకే రాత్రీపగలు ప్రణాళికా బద్ధంగా చదివాను. అందుకే జాతీయస్థాయిలో71వ ర్యాంకు సాధించగలిగానంటూ రెడ్డివేదిత పేర్కొన్నారు. 23 ఏళ్లకే దేశంలోని అత్యంత కీలకమైన ఐఏఎస్ బాధ్యతలు చేపట్టనున్న వేదిత.