గ‌తేడాది మార్చి నుంచి మాకు పూర్తిగా దూర‌మ‌య్యాడు. అదిల్ ఉగ్రవాదిగా మారాడని తెలుసుగాని, అతడు ప్రాణాలకు తెగించి ఇంత ఘాతుకానికి పాల్పడతాడని మేం అసలు ఊహించలేదు. ప్రాణం ఎవరిదైనా ఒకటే. నా కొడుకు చేసిన ఆత్మాహుతి దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలు ఎంతగానో బాధపడుతున్నాయి. ఆ బాధ మాకూ ఉంది ’ అని గులామ్ చెప్పాడు.