శాసనసభ ఎన్నికల్లో ప్రజాకూటమికి 75 నుంచి 80 స్థానాల్లో విజయం తథ్యమని, అందుకే ఇక తాను గడ్డం తీసే సమయం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గడ్డం తీస్తానని గతంలో ప్రకటించిన ఉత్తమ్…ఈ నెల 11 లేదా 12వ తేదీన గడ్డం తీయనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాకూటమికి దారుణ ఓటమి ప్రాప్తించడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం తీస్తారా లేక వచ్చే ఎన్నికలవరకు అలాగే ఉంటారా చూడాల్సిఉంది…