ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ, వీ.హెచ్.పి, భజరంగ్ దళ్ నాయకుల అరెస్ట్. 

Advertisement

వరంగల్ ఓ సిటీ లోని శ్రీ వీరాంజయనేయ స్వామి ఆలయ దారిని KUDA అధికారులు శుక్రవారం నాడు మూసివేశారు. ఈ విషయం తెలిసి ఈరోజు ఉదయం ఆందోళనకు దిగిన బిజెపి, భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మిల్స్ కాలనీ పొలిస్ స్టేషన్ కి తరలించారు. అరెస్టయిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు అమరెందర్ రెడ్డి, వరంగల్ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ మండల సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగని జగదీశ్వర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పుప్పాల రాజేందర్, జిల్లా కార్యదర్శులు కనుకుంట్ల రంజిత్, పులిశెరి ఉపేందర్,

ఎస్సి మోర్చా రాష్ట్ర నాయకులు మార్టిన్ లూథర్, మాదాసి రాజు, వివిధ డివిజన్ అధ్యక్షులు పల్లకొండ కొటేశ్వర్, బొడ్డు రాకేష్, శ్రీరామోజు మోహనచారి, వి.హెచ్.పి, భజరంగ్ దళ్ నాయకులు నందాల చందర్ బాబు, నిఖిల్, తిరుమల్, తదితరులు ఉన్నారు.