పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామ ఉపసర్పంచిని సస్పెండ్‌ చేస్తున్నట్లు అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు మండల పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ఉపసర్పంచి మౌనిక ఇటీవల 30 రోజుల ప్రణాళికలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల బిల్లుల మంజూరుకు సహకరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ మేరకు డివిజినల్‌ పంచాయతీ అధికారి విచారణ అనంతరం కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడుసార్లు అధికారులు నోటీసులు అందించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా నూతన పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆరు నెలలు సస్పెండ్‌ చేశారు. అవిశ్వాస తీర్మానం కోసం తప్పా, పంచాయతీ సమావేశంలో పాల్గొనేందుకు అర్హులు కారని ఉత్తర్వులో పేర్కొన్నారు…