ఉమ్మడి జిల్లాల్లో సీఎం పర్యటనతో ఆసక్తిగా మారనున్న రాజకీయం
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన చేపట్టనుండటంతో రాజకీయాలు ఆసక్తిగా మారనున్నాయి. ఈనెల 19న పాలకుర్తి, 23న ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. వివరాలు మేరకు నాలుగు సభలకు హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఒకే రోజు వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రచారం చేయనున్నారు.