అనుమానంతో భార్యను గొంతుకోసి చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతలపాడు శివారు ఠాక్యతండాకు చెందిన సేవాలాల్‌కు మరిపెడ మండలం ధరావత్ తండాకు కస్తూరి (30) కి ఆరేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. రెండేండ్లుగా సేవాలాల్ కస్తూరిపై అనుమానం పెంచుకొని చిత్రహింసలకు గురి చేస్తుండటంతో ఆమె రెండు నెలలుగా పుట్టింట్లో ఉంటూ మరిపెడలోని క్లినిక్‌లో పనిచేస్తున్నది. మంగళవారం సేవాలాల్ క్లినిక్ వద్దకు వచ్చి అందరు చూస్తుండగానే కత్తితో కస్తూరి గొంతుకోసి చంపాడు. పోలీసులు వెంటాడి నిందితుడిని పట్టుకున్నట్టు సమాచారం.