ముక్కుపచ్చలారని అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ఓ చేత బావిలో వేసి వెళ్లిపోయారు. ఘటన నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో ఓచేత బావిలో మృత శిశువు లభ్యమైంది. అదే గ్రామానికి చెందిన సోమయ్య సాయత్ర చేదబావి లో మృత శిశువు ఉన్నట్లు గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోని మృత శిశువును బయటకు తీశారు. గ్రామ విఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాగా గత రెండు రోజుల క్రితమే శిశువును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చేదబావి లో వేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.