కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మెడికల్ సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా మరో 15మంది మెడికోలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, కాకతీయ మెడికల్ కాలేజీలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 44కు చేరుకుంది.

కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లతో సహా 29 మంది మెడికోలకు నిన్న మధ్యాహ్నం వరకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, తాజాగా మరో 15 మందికి పాజిటివ్‌గా తేలడంతో కలకలం మొదలైంది.