పోటీ ప్రపంచం లో ఉద్యోగం సాధించడం కోసం యవత నిరంతరం కష్టపడుతుంటారు . అయితే ఒక్క ఉద్యోగం పొందడమే గగనమైన, ఈ రోజుల్లో మూడేళ్లలో మూడు ఉద్యోగాలు పొంది పలువురి మన్ననలు పొందుతుంది . మండలంలోని మొరిపిరాలకు చెందిన వల్లునూరి శ్రీలత . ఈమె 2017లో TSPSC ద్వారా జయశంకర్ భూపాలపల్లిలోని మహాత్మాజ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల కళాశాలలో టీజీటీగా ఎంపికైంది . 2018లో అదే టీఎస్పీఎస్సీ ద్వారా పీజీటీగా 2019లో డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా బీసీ – ఎ విభాగం లో స్టేట్ రెండవ ర్యాంక్ సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంది . చదువుపై పట్టుదలతో తన భర్త నాగరాజు ప్రోత్సాహంతో ప్రభుత్వ డిగ్రీ అధ్యాపకురాలిగా ఎంపికవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు . జనవరి 30న విడుదలైన ఫలితాల్లో అధ్యాపకురాలిగా ఎంపికైనట్లు పేర్కొ న్నారు . పట్టుదల , చదువుపై మక్కువ ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని నిరూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తుంది శ్రీలత .