భార్య పండుగకు పుట్టింటికి వెళ్లి ఫోన్ చేసినా రాకపోవడంతో భర్త మనస్థాపంతో ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దకోడెపాకలో జరిగింది
వరంగల్ శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రాపర్తి సందీప్(25) డైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. సంక్రాంతి పండుగకు అతడి భార్య అశ్విని తన తల్లిగారి ఊరైన రేగొండకు వెళ్లింది. ఆమెకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. రాని పక్షంలో చనిపోతానని తెలిపాడు. కాగా భార్య ఇంటికి రాలేదని మనస్థాపంతో గురువారం రాత్రి ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.