మండల కేంద్రం మోడల్ స్కూల్లోని వసతి గృహంలో బుధవారం మధ్యాహ్నం మడ్డి ప్రసన్న ( 16 ) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది .

Advertisement

విద్యార్డుల కథనం ప్రకారం . మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ప్రసన్నను పాఠశాలలో ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయురాలు వ్యక్తిగత కారణాల తో తోటి విద్యార్థుల ముందు మందలించారు . దీంతో మనస్తాపానికి గురై వసతి గృహంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది . ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు ప్రిన్సిపా లకు తెలపటంతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రసన్నను ఆస్పత్రికి తరలించారు . పరిస్థితి విష మించినట్లు తెలుపటంతో వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు . ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురికి ప్రసన్న మృతుదేహన్ని తరలించారు శోక సంద్రంలో కుటుంబ సభ్యులు – ప్రసన్న మృతితో తోటి విద్యార్థులు , కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు ప్రసన్న అందరితో కలివిడిగా ఉండేదని , అందరి మన్ననలు పొందుతూ చదువులో రాణించేదని విద్యార్థులు శోక సముద్రంలో మునిగిపోయారు .

విద్యార్థిని మృతిపై అనుమానం

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని మోడల్ స్కూల్ లో నిన్న10 వ తరగతి విద్యార్థిని ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పై పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు బందువులు.