ఊమ్మడి వరంగల్: భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి, కుందయ్యపల్లి 353 జాతీయ ప్రధాన రహదారిపై మూడు చోట్ల ప్రమాదకరంగా గోయులు ఏర్పడగా మోరంచవాగు వంతెన రోడ్డుపై గుంతపడే ప్రమాదకరంగా మారినా అధికారులెవరూ పట్టించు కోవడం లేదు. సుమారు 5 మీటర్ల వెడల్పుతో బీటీ లేచిపోయి ఇనుప చువ్వలు పైకి కని పిస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల, జిల్లా ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు మరింతగా పగిలిపో తుంది. భారీ వాహనాలు వెళ్తుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో నని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ రహదారిపై ప్రతి రోజు ప్రజాప్రతినిధులు, ఉన్నతా ధికారులు ప్రయాణిస్తున్నప్పటికీ వారు పట్టించుకోకపోవడం పట్ల వాహనదారుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వంతెనపై ఏర్పడ్డ గుంతలు పూడ్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.