ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న రష్మిక :
తెలుగు లో “ఛలో” సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తోలి సినిమాతోనే సక్సెస్ ని అందుకుంది రష్మిక. ఆ సినిమా తరువాత ఏకంగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో “గీత గోవిందం” సినిమాలో నటించి పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకుంది ఈ భామ. అయితే ఈ భామ గత ఏడాది కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకుంది.
Advertisement
కానీ ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంది అంట రష్మిక. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్లే రష్మిక ఈ ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకునట్టు తెలుస్తుంది. తన తల్లితండ్రులు అలాగే తన సన్నిహితుల సలహా మేరకే రష్మిక ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం తెలుగు లో ఈ భామ వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి, తెలుగు లో మాత్రం ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన “డియర్ కామ్రేడ్” అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ.