. శారీరకంగా మార్పులు జరుగుతాయి. పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామాలు చేయడం వల్ల ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. పిల్లల్లో ఆలోచనాశక్తి కూడా పెరుగుతుంది. ఈ వయసు పిల్లలు ఎక్కువ సమయం స్కూల్ లోనే గడుపుతారు.
ఉదయం ఎనిమిది గంటలకు వీళ్లకి స్కూలు మొదలైతే పదిన్నర వరకూ వరుసగా క్లాసులు జరుగుతాయి. సాయంత్రం వరకు బడిలోనే ఉంటారు. అన్ని గంటలూ నిద్రపోకుండా ఏదో ఒక యాక్టివిటీలో ఉంటారు. అందువల్ల పిల్లలకు ఎక్కువ శక్తి అవసరం. ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ ఎగ్గొట్టడం మంచిది కాదు. బ్రేక్ ఫాస్ట్ తినలేకపోతే కనీసం పాలు, ఒక ఫ్రూట్, గుప్పెడు నట్స్ ఇవ్వాలి. లంచ్‌కు అన్నం లేదా గోధుమ రొట్టెలు, వెజిటబుల్ సలాడ్ , కొద్దిగా పెరుగు తినాలి. అరటిపండు లేదా జామ లేదా యాపిల్ పండును లంచ్ బాక్సులో పెట్టివ్వాలి.
సాయంత్రం తాజాపళ్లతో చేసిన మిల్క్‌షేక్, ఒకకప్పు మొలకలు, ఆమ్లెట్ తినొచ్చు. డిన్నర్ కు ఫ్రూట్ సలాడ్స్ పెట్టాలి. పిల్లల వయసుకు తగ్గట్టు వారి అరుగుదల దృష్టిలో పెట్టుకొని డైట్‌ఫాలో కావాలి.