రెండు బైకులు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జన్నె హారిష్ (24),తూర్పాటి సుధాకర్ అబ్రహాం (26) గా పోలీసులు గుర్తించారు.

జిల్లాలోని బచ్చన్నపేట మండలం చిన్నరాంచెర్ల వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.