తూర్పు గోదావరి : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ కార్తికేయ హెచ్చరించారు. సోమవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై వివరాలను వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ప్రటించారు. నియమ, నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.