రూ. 50,000 నగదుకు మించి ఎవరివద్దా ఉండకూడదు

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా రూ. 50 వేల వరకు మాత్రమే నగదు కలిగి ఉండాలని, అంతకు మించి ఉంటే చట్టప్రకారం చర్యలు ఉంటాయని జీడబ్ల్యూఎంసీ కమిషనర్, వరంగల్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ స్పష్టం చేస్తారు. ఈ మేరకు ఎన్నికల నియమావళిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలక్షన్ కమిషన్ ప్రవర్తన నియామవళిని పాటించి సహకరించాలని,

రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వ ఆస్తులపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం చేయరాదని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్తులపై సదరు యజమాని అనుమతి లేకుండా ఎటువంటి రాతలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టరాదని తెలిపారు.