ఎన్నికల సెల్ ను ప్రారంభించిన కలెక్టర్

జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 106 ఎలక్షన్ సెల్ ను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సెల్ లో ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. అనంతరం సువిధ కేంద్రాన్ని పరిశీలించి దరఖాస్తుల వివరాలను అడిజి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వీపీ గౌతమ్ నిఘా బృందాల ఏర్పాటు, పనితీరు, ఓటర్ అవగాహన కేంద్రాలు తదితర అంశాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు వివరించారు.

కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద, బల్దియా కార్యదర్శి విజయలక్ష్మీ, తహసీల్దార్లు రాజేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.