వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే గురుకుల కళాశాలను సందర్శించేందుకు వచ్చిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని చూసి ప్రిన్సిపల్‌ మనోహర్‌రెడ్డి లోపలికి వెళ్లడంపై MLA ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే పాఠశాలకు వస్తున్న క్రమంలో చూసి పట్టించుకోకుండా లోపలికి ఎలా వెళతారని నిలదీశారు. పాఠశాలలో ఇంటర్‌ విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంలో , విద్యార్థులు కళాశాల ముందు బుధవారం ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఆయన పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులు బయట ఎందుకు ఉన్నారని ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో గొడవ జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు.

విద్యార్థులతో క్షమాపణ పత్రాన్ని రాసుకొని తరగతి గదిలోకి అనుమతించాలని, పరీక్షలు ప్రారంభం కాబోతున్న క్రమంలో ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ఎమ్మెల్యే చొరవతో ప్రిన్సిపల్‌ వారిని లోపలికి అనుమతించారు. అనంతరం తరగతి గదులు, వంట గదిని పరిశీలించారు. పాఠశాల, కళాశాల ఒకే చోట కొనసాగుతుండటం9. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని తెలియజేయడంతో సంబంధిత పాఠశాల కార్యదర్శి మల్లయ్యభట్టుతో Phone ? లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు…