వరంగల్ పశ్చిమ నియోజకవర్గ తెరాస అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ గారు ఈరోజు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు,విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు , రాష్ట్ర మహిళ కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధారాణి గారు, మైనారిటీ మత పెద్దలు మజీద్ గారి తో కలిసి నామినేషన్ వేయడం జరిగింది.

వరంగల్ వడ్డేపల్లి:

చిన్నారులు సైతం దాస్యం వినయ్ భాస్కర్ గారి గెలుపుకై వారి నామినేషన్ కి విరాళాలు…

ఎన్నికల ఖర్చు లో భాగంగా దాస్యం వినయ్ భాస్కర్ గారికి నామినేషన్ ఖర్చుల నిమిత్తం కాజీపేట కు చెందిన జోసఫ్ రాబర్ట్ పూర్ణిమ దంపతుల పిల్లలు జోసఫ్ ఆస్న, ధరణిలు చాలా రోజుల నుండి కిడ్డీ బ్యాంకులో దాచి పెట్టుకున్న రూపాయలను నేడు దాస్యం వినయ్ భాస్కర్ గారి గెలుపు కై వారి నామినేషన్ పురస్కరించుకొని ఈరోజు ఉదయం వడ్డేపల్లి లోని వారి స్వగృహంలో వారికి విరాళంగా అందజేయడం జరిగింది..