స్టేషన్ ఘనపూర్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పల్లగుట్ట గ్రామ శాఖ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమక్షంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా పోటీచేసిన జీడీ ఝాన్సీ రాణి, ఆనందం, జయపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, భగవాన్ రెడ్డి, మరియ 25 మంది వారి అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొట్టు మానస, ఎంపీటీసీ చిర్రా ఎల్లమ్మ, ఉపసర్పంచ్ బతిని శ్రీనివాస్, తెరాస పార్టీ నాయకులు నాగరాజు, చొక్కయ్య ఈసరం విమల, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పశువలు ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.