ఎర్రగడ్డ భాగ్యనగరంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన 2022, ఏప్రిల్ 08వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.మానసిక చికిత్స ఆలయంలో ఓపెన్ గ్రౌండ్ కు ఆదిల్, అజర్, మహమూద్ ఆలీలు వచ్చారు. ఏదో విషయంలో ముగ్గురి మధ్య మాటమాట పెరిగింది. ఇది కాస్తా ఘర్షణకు దిగింది. ఆదిల్ పై అజర్, మహమూద్ లు దాడికి పాల్పడ్డారు. ఆదిల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు.మంటలకు తాళలేక ఆదిల్ పరుగులు తీశాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆదిల్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 90 శాతం గాయాలయ్యాయని తెలుస్తోంది. నిందితులపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికంతటికి కారణం పాతకక్షలు అనేది తెలుస్తోంది. పక్కాప్లాన్ తో నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.