తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి క్యాబినెట్ విస్తరణకు సన్నాహాలు చేపట్టారు . వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రథమ ప్రాధాన్యత దక్కనుందని రాజకీయ విశ్లేషకులు చెబు ఉన్న మాట . రాజకీయాలలో అరంగేట్రం చేసింది మొదలు ఓటమి ఎరుగని నేతగా ఎదుగుతూ రాజకీయాలలో ఎర్రబెల్లి రాణిస్తూవస్తున్నారు. రెండవసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించాడు ఎర్రబెల్లి , విజయం సాధించిన నాటి నుండి మంత్రి పదవి దక్కుతుందని పాలకుర్తి నియోజకవర్గ ప్రజలే కాకుండా వరంగల్ జిల్లా ప్రజలు మొత్తం చర్చించుకుంటూ వస్తున్నారు .

జిల్లాలో సీనియారిటి ప్రకారం చేసినా ఎర్రబెల్లి మొదటి స్థానంలో నిలువనున్నారు . జరుగబోయే క్యాబినెట్ విస్తరణలో 6 నుండి 11 మంత్రి పదవులు రానున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు దీనిలో పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్ రావుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ మంత్రి పదవి దక్కే అవకాశాలు గురించి చర్చ జరుగుతుంది వరంగల్ ఉమ్మడి జిల్లాలో సామాజికవర్గంలో చూస్తే రెడ్యానాయక్ , తాటికొండ రాజయ్య , ఆరూరి రమేష్ శంకర్ నాయక్లు ఉన్నారు . రెడ్డి వెల్మ సామాజిక వర్గాన్ని తీసుకున్నపుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ముత్తిరెడ్డి యాదగి రిరెడ్డి , చల్లా ధర్మారెడ్డి , పెద్ది సుదర్శన్ రెడ్డిలున్నారు . బీసీ వర్గానికి చెందిన వినయ్ భాస్కర్ , నన్నపనేని నరేందర్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు . వీరిలో సీనియారిటీ ప్రకారం చూస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు , రెడ్యా నాయక్ , వినయ్ భాస్కర్లు ఉండగా మొదటి విస్తరణలో ఎర్రబెల్లికి ప్రాధాన్యత దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయనే మాట వినిపిస్తుంది . నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఎర్రబెల్లికి అమాత్య పదవి అందాలని నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకోణం నుండి చూసినా అమాత్య పదవికి అరుడు ఎర్రబెల్లి ..