ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి రావడంపై జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు . గురువారం పాలకుర్తిలో ఆయన మాట్లాడారు . టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కారణంగా అభివృద్ధి చేయలేదని , టీఆర్ఎస్ లో చేరిన తర్వాత సమయం సరిపోలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు . ఇకనైనా ఈ ప్రాంత అభివృద్ధికి ఎర్రబెల్లి కృషి చేయాలని కోరారు . ప్రతిపక్ష పార్టీగా అభివృద్ధికి సహకరిస్తామన్నారు . ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ , మండల అధ్యక్షు డు అనుముల మల్లారెడ్డి , గిరగాని కుమార టీఆర్ఎస్వామిగౌడ్ , చిలువేరు క్రిష్ణమూర్తి , తీగారం సర్పంచ్ పోగు శ్రీనివాస్ జలగం కుమార్ , అడ్డూరి రవీందర్ రావు పాల్గొన్నారు .