మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది . ఆదివారం ప్రమాణ స్వీకారం ఉంటుందని తొలుత ప్రచారం కాగా , కార్యక్రమం వాయిదా పడినట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి . అయితే విస్తరణ ముహూర్తం ఎప్పుడు ఎలా ఉన్నా . మంత్రి పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని పది మంది ఎమ్మె ల్యేలు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు . అవకాశం ఉంటే మంత్రి , లేక పోతే పార్లమెంటరీ సెక్రటరీ పదవి అయినా రాక పోతుందా అన్న ఆలో చనతో ఉన్నారు . అంతేకాదు కొంత మంది ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేసి, ఈ రెండు రాక పోతే రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి అన్నా రాక పోతుందా అనే వ్యూహంతో ప్రయత్నిస్తూనే ఉన్నారు .

ఎర్రబెల్లి వర్సెస్ దాస్యం ?

మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి పోటీ పడే వారిలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి . పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ల మధ్యనే పోటీ ఉందన్న చర్చ సాగుతోంది . నిజానికి టీఆర్ఎస్ పార్టీ పరంగా వినయభాస్కర్ సీనియర్ నాయకుడు . అంతే కాదు టీఆర్ఎస్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు . ఈసారి తప్పకుండ మంత్రి పదవి ఇయ్యాల్సిన పరిస్థతి నెలకొంది అని చెప్పుకోవచ్చు .. ఎందుకంటే పార్టీని ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా ప్రజలలో గుర్తింపు ఉంది , ఒకవేళ ఏకారణాల చేతైనా ఇవ్వకపోతే . ప్రజల నుంచి పార్టీ పైన వ్యతిరేక భావన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి మంత్రివర్గంలో వినయభాస్కర్ కి కంఫార్మ్ ఐనట్టే అని తెలుస్తుంది … ఇక పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం రాజకీయంగా సీనియర్ ఎమ్మెల్యే అయిన, టీఆర్ఎస్ మొదటి సారి అవుతుంది. ఏకంగా TDLP టీఆర్ఎస్ పార్టీలో కలిపిన క్రెడిట్ దయాకర్రావుకు ఉంది . వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ఓటమి పాలవడం లాంటి ఆంశాలు ఎర్రబెల్లికి కలిసివచ్చే అవకాశంగా కాగా KTR , హరీశ్ రావు లాంటి వాళ్ళకు కూడా, ఈసారి మంత్రి వర్గంలో చోటు దక్కదన్న నేపధ్యంలో ఎర్రబెల్లికి దక్కే అవకాశం ఉంటుందా అన్న లేకపోలేదు . వారికి దక్కక పోతేనే ఎర్రబెల్లికి అవకాశం ఉంటుంది . వారికి అవకాశం దక్కితే అదే వెలమ సామాజిక వర్గానికి చెందిన దయాకర్ రావు సారి విస్తరణలో అవకాశం ఉంటుదన్న ప్రచారం జరుగుతోంది . కాగా ,

వినయభాస్కర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు ఆత్మీయుడిగా గుర్తింపుపొందారు . అదే విధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వల్ల ఈసారి తప్పకుండా మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చునని అంటున్నారు . గతంలో వినయభాస్కరకు పారమెంటరీ కార్యదర్శి పదవి ఇచ్చారు . ఇపుడు అలాంటి పదవి కాకుండా , మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ..

కడియంకు చోటు ?

మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనుండడంతో ఆ స్థానం. మాజీ డిప్యూటీ సీయం కడియం శ్రీహరికి అవకాశం దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న కడియం లాంటి నేతను తప్పకుండా మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది . ఇక ఎమ్మెల్యే అరూరి రమేశ్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం . రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేశ్ దళిత కోటాలో మంత్రి అయ్యే అవకాశాలను కొట్టి పారేయ్యలేమన్న చర్చ కూడా ఉంది . ఇక మహబూబాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత రెడ్యానాయకకు కూడా మంత్రి వర్గంలో చోటు దక్కనుందంటున్నారు . మంత్రిగా ఉన్న చందూలాల్ ములుగు నుంచి ఓటమి పాలు కావడంతో గిరిజన కోటాలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయకకు అవకాశం దక్కుతుందంటు న్నారు ….