తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో తలపెట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం ప్రారంభమైంది. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో యాగాలు చేపట్టారు. తొలిరోజు వంద సప్తపతి చండీ పారాయణాలు, సహస్ర చండీయాగం, రాజ శ్యామల యాగం, చతుర్వేద మహాయాగం, సప్తశతి యాగం, రుద్రమహాయాగాలను సుమారు 300 మంది రుత్వికులు నిర్వహిస్తున్నారు.

సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దంపతులు, ఎంపీ కవిత, హరీశ్‌రావు దంపతులు, కె.కేశవరావు దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.