వరంగల్ అర్బన్ : కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ వరంగల్ అర్బన్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు చేశారు అధికారులు. మూడో విడత ఎన్నికల సందర్భంగా.. ఎల్కతుర్తిలో ఆర్డర్ల వారీగా డ్యూటీకి పంపించేందుకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది తరలి వచ్చారు. ఇందులో ఎలక్షన్‌‌‌‌ డ్యూటీకి చంటి పిల్లలను ఎత్తుకుని వచ్చారు. యూనిఫాంలో తమ పిల్లలను ఎత్తుకుని విధులకు హాజరయ్యారు.

ఓవైపు పిల్లలు, మరో వైపు బ్యాగులతో పోలీసులు విధులు నిర్వహించారు. వీరితో పాటు వచ్చిన మరికొంత మంది మహిళా పోలీసులు ఇలాంటి వారికి డ్యూటీలు వేయకుంటే బాగుండేదని చర్చించుకోవడం కనిపించింది.