అశ్లీల వీడియోలు చూపి వాటిలో ఉన్నట్లు కోరికలు తీర్చాలని, భర్త చెప్పినట్లు భార్య వినాలని, మరొకరి దగ్గరకు వెళ్లాలని చెబితే వెళ్లాలని నిత్యం మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడంటూ ఓ భర్తపై భార్య ఫిర్యాదు చేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం: శ్రీనగర్‌ కాలనీ ప్రాంతంలో నివసించే ఓ మహిళ (33)కు రఘు (35)అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే భర్త వేధింపులు ప్రారంభమయ్యాయి. ప్రైవేటు సంస్థలో పనిచేసే ఆమె జీతం, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో పాటు దాచుకున్న డబ్బులను అతను తీసుకున్నాడు. పెళ్లికి ముందు దాచుకున్న డబ్బునూ తీసుకున్నాడు. తల్లిదండ్రులకు మద్దతిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కొద్ది రోజులుగా మొబైల్లో నీలిచిత్రాలు చూపిస్తూ ప్రకృతి విరుద్ధ లైంగిక చర్యలో పాల్గొనాలని ఆమెను బలవంతం చేస్తున్నాడు. ఆమె నిరాకరిస్తుండడంతో తీవ్రంగా వేధిస్తున్నాడు. తనకు విడాకులు కావాలని బెదిరించాడు. భర్త చెప్పినట్లు భార్య వినాలని, మరొకరి దగ్గరకు వెళ్లాలని చెబితే వెళ్లాలని వేధించడం మొదలెట్టాడు. ఈ నెల 26న ఆమెను కొట్టి బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగిరాలేదు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు ఇవ్వగా బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై 498(ఎ), 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…