టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ పరిణామాలపై నాయకుల కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. గులాబీ జెండా ఓనర్షిప్ పై మొన్న మంత్రి ఈటల రాజేందర్.. ఇవాళ ఉదయం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తాజాగా.. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా మరో ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

గులాబీ జెండా ఓనర్లం తామే అని హుజూరాబాద్ సభలో మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఐతే! మంత్రి ఎర్రబెల్లి మీడియాతో చిట్ చాట్ చేస్తూ గులాబీ జెండా ఓనర్ కేసీఆరే అన్నారు. గులాబీజెండాను కేసీఆరే తయారుచేశారని అన్నారు.

మీడియాతో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జరిపిన చిట్ చాట్ లోనూ ఆయన ఈ విషయంపై స్పందించారు. టీఆర్ఎస్ లో ఉన్నవాళ్లంతా గులాబీ జెండా ఓనర్లేనని అన్నారు. గులాబీ జెండాపై హక్కు టీఆర్ఎస్ లో ఉన్నవాళ్లకే ఉంటుందన్నారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలొనే వున్నాడు కదా. ఇక సమస్య ఎక్కడుందని కర్నె ప్రభాకర్ చెప్పారు. ఈటల రాజేందర్ అలా స్పందించడం వెనుక వేరే కారణాలు ఉండొచ్చని అన్నారు. స్థానికంగా ఒకరిద్దరు నేతలతో ఇబ్బంది కలిగి ఆ మాటను ఈటల మాట్లాడి ఉంటాడని అభిప్రాయపడ్డారు కర్నె ప్రభాకర్…