ఎవరు గొప్ప ముఖ్యమంత్రి? అనే ప్రశ్నకు?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే తనకు చాలా ఇష్టమని సినీ హీరో విజయ్ దేవరకొండ తెలిపాడు. తాను చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయకత్వాన్ని చూశానని చెప్పాడు. హైదరాబాదును అగ్రశ్రేణి నగరంగా చంద్రబాబు తయారు చేశారని కితాబిచ్చారు. ఉద్యోగులంతా సరైన సమయానికే కార్యాలయాలకు వచ్చేందుకు ఆయన బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేశారని.

అది తనకు ఎంతో నచ్చిందని చెప్పాడు. అయితే ఈ విధానాన్ని తీసుకువచ్చిన చంద్రబాబు పట్ల ఉద్యోగులు ఆగ్రహాన్ని వెలిబుచ్చారని అన్నాడు. ఎవరు గొప్ప ముఖ్యమంత్రి? అనే ప్రశ్నకు బదులుగా ఆ విషయం తనకు తెలియదని చెప్పాడు. తన తాజా చిత్రం ‘నోటా’ ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రశ్నలకు బదులిస్తూ విజయ్ ఈ మేరకు స్పందించాడు.