ఆయన ఎస్పీ అని ఆమెకు తెలియదు. కాకపొతే తనను ఏమి అవ్వా బాగున్నావా అని పలకరిస్తే , తిండి తిన్నావా అయ్యా అని అడిగి ,ఇంట్లోకి పిలిచి జొన్న రొట్టె పెట్టి ఆప్యాయంగా తినిపించింది. ఇలా జనంతో మమేకం కావడం ఎలాగో చూపించారు ఆ ఎస్పీ .

ఆదివారం కర్ణాటకలో రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కుర్డి గ్రామంలో ఎస్పీ వేదమూర్తి ఆధ్వర్యంలో యువత, ఉద్యోగులు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. పాడుబడ్డ బావిని శుభ్రం చేసి, దాని చుట్టూ మొక్కలు నాటారు. ఎస్పీ వేదమూర్తి గ్రామంలో సంచరిస్తున్న సమయంలో పాలమ్మ (70) అనే వృద్ధురాలు ఆయనకు నమస్కారం చేసింది.

బాగున్నావా అని ఎస్పీ ఆమెను పలకరించారు. ఉదయం ఏమైనా తిన్నారా?, తింటావా అని ఆమె ఎస్పీని ప్రశ్నించింది. ఎస్పీ సరేనంటూ ఆమె పూరిపాకలోకి వెళ్లారు. పాలమ్మ ఇచ్చిన జొన్నరొట్టే, శనగపిండి కూరని తిన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.