ఏకగ్రీవంగా మారిన వరంగల్ తూర్పు నియోజకవర్గం

వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని సుమారు 24 డివిజన్లలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లే ఉండటం ఆపార్టీకి పెద్ద బలం. డివిజన్లలో ప్రతిపక్షాలకు ప్రాతినిధ్యం లేకపోవడం, ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా బలంగా లేకపోవడం టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. కార్పొరేటర్లంతా నిత్యం ప్రజల మధ్య ఉండటం, ఇప్పటికే పథకాలన్నీ ఇంటింటికీ చేరడం పార్టీకి అదనపు బలంగా మారుతోంది. ప్రతిపక్ష పార్టీల్లో ఇ ప్పటికీ అభ్యర్థులు ఖరారు కాకాపోవడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది.

మహాకూటమిలో ని ఏ పార్టీ ఖాతాలోకి తూర్పు నియోజకవర్గం పో తోందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో కూటమి పార్టీల కార్యకర్తలు ఆయోమయంలో ఉ న్నారు. టీఆర్‌ఎస్‌కు క్షేత్రస్థాయిలో బలమైన క్యా డర్ ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది.