దేశంలో ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈనెల 21 ఆలిండియా బ్యాంకు అధికారుల సమ్మె, 22 నాలుగో శనివారం, 23 ఆదివారం, 25 నేషనల్ హాలీడే ఉంది. అలాగే ఈనెల 26న బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపు ఇచ్చారు. దీంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
– 21న సమ్మెకు ఆలిండియా బ్యాంకు ఆఫీసర్ల సంఘం (AIBOC) పిలుపునిచ్చింది.
– 22 నాలుగో శనివారం. బ్యాంకులకు సెలవు
– 23 ఆదివారం
– 24న బ్యాంకులు పనిచేస్తాయి
– 25 క్రిస్మస్ సెలవు
– 26 యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (UFBO) సమ్మెకి పిలుపునిచ్చింది.
బ్యాంకుల సమ్మెలు, వివిధ సెలవులను దృష్టిలో ఉంచుకొని కస్టమర్లంతా తమ అవసరాలకు తగిన డబ్బులను తమ వద్దే ఉంచుకోవాలని సూచిస్తున్నారు. సమ్మెలు, వరుస సెలవుల నేపధ్యంలో బ్యాంకులు మూతపడటం, ఏటీఎంలో డబ్బు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతాయని ఖాతాదారులు ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని బ్యాంకు అధికారులు కూడా కోరుతున్నారు.