ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులను కోట్టి దారి దోపిడిలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల బందిపోటు ముఠాను బుధవారం సి.సి.ఎస్ పోలీసులు అరెస్టు చేసారు.
అరెస్టు ముఠా సభ్యుల నుండి సుమారు 3లక్షల 63వేల రూపాయల విలువ గల 15గ్రాముల బంగారు అభరణాలతో పాటు, మూడు ప్యాసింజర్ ఆటోలు, రెండు సెల్‌ఫోన్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన ముఠా సభ్యుల వివరాలు:
1. గువ్వల శివ, తండ్రి పేరు రమేష్, వయస్సు 22, ముల్కలగూడెం గ్రామం, ఐనలోని మండలం, వరంగల్ ఆర్బన్ జిల్లా.
2. అరికెల శ్రీవర్థన్ తండ్రి పేరు శ్రీనివాస్, వయస్సు 20, మడిపల్లి గ్రామం, హసన్‌పర్తి మండలం, వరంగల్ ఆర్బన్ జిల్లా.
3. చాగంటి వంశీ, తండ్రి పేరు అయిలయ్య, వయస్సు 27, గవిచర్ల రోడ్, రంశాయిపేట్, వరంగల్(ఆ)జిల్లా.
4. దోమల రాజు, తండ్రి సంపత్, వయస్సు 22,ముల్కలగూడెం గ్రామం, ఐలోని మండలం, వరంగల్ ఆర్బన్ జిల్లా.
5. ఎర్ర కార్తీక్, తండ్రి పేరు కిషన్, వయస్సు 20, గ్రామం నక్కలపల్లి, వరంగల్ ఆర్బన్ జిల్లా.
ప్రస్తుతం పరారీలో వున్న నిందితులు:
మన్నె యశ్వంత్, సింగారపు ప్రమోద్ వున్నారు
ఈ అరెస్టుకు ఈస్ట్ జోన్ డి.సి.పి కె.ఆర్.నాగరాజు వివరాలను వెల్లడిస్తూ, నిందితుల్లో ప్రధాన నిందితుడైన గువ్వల శివ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ గత సంవత్సరం 2018లో మద్యానికి ఆలవాటు పడి జల్సాలు చేసేవాడు. ఇందుకు అవసరమైన డబ్బు కోరకు నిందితుడు ఐనవోలు, గీసుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో దారి దోపడి మరియు బందిపోటు చోరీలకు పాల్పడటంతో నిందితుడుని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
నిందితుడు శివ జైలులో వున్న సమయంలో మరో ఇద్దరు నిందితులు అరికెల శ్రీవర్థన్, చాగంటి వంశీలతో పరిచయం అయింది. ఈ ముగ్గురి మధ్య పరిచయం కాస్తా స్నేహంగా మారింది. దినితో నిందితులు ముగ్గురు గత సంవత్సరం జైలు నుండి విడుదలయి అనంతరం తిరిగి ముగ్గురు నిందితులు మరోమారు కలుసుకున్నారు. అనంతరం ప్రధాన నిందితుడైన శివ తన గ్రామస్తుడైన దోమల రాజు మరియు మరో నిందితుడు చాగంటి వంశీ స్నేహితులు ఎర్ర కార్తీక్, మన్నె యశ్వంత్, సింగారపు ప్రమోదులతో స్నేహం కుదరటంతో నిందితులందరు కల్సి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. వీరుకి తమ సంపాదించే ఆదాయం తాము చేసే జల్సాలకు సరిపోకపోవడంతో ఆటో చోరీలు చేసేందుకు ప్రణాళికను సిద్దం చేసుకున్నారు.
ఇందులో భాగం నిందితులందరు కల్సి ఆరు చోరీలకు పాల్పడగా ఇందులో మూడు బందిపోటు దోంగతనాలతో పాటు, మూడు దారిదోపిడి చోరీలకు పాల్పడ్డారు. ఇందులో పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్, ఖమ్మం జిల్లా ఖానాపూర్ అవేలి, ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కక్క ఆటో చోప్పున మూడు ఆటోలను చోరీ చేయగా, మరో మూడు చోరీలు పర్వతగిరి,దామెర, గీసుగోండ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణం చేసే వ్యక్తులను నిందితులు గుర్తించి వారిని ప్యాసింజర్ ఆటోలో ఎక్కించుకోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకవేళ్ళి సదరు ప్రయాణికుడుని చితకబాది వారి నుండి బంగారు అభరణాలు, సెల్‌ఫోన్లను చోరీ చేసి అక్కడి నుండి ఆటోలో పారిపోయేవారు.
నేను సైతం కార్యక్రమములో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు మార్గాల్లో ఏర్పాటు చేసిన సి.సి కెమెరాల దృష్యాల అధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు నిందితులు ఐదుగురు ఈ రోజు ఉదయం వరంగల్ రంగశాయిపేట్ గవిచర్ల క్రాస్ రోడ్ ప్రాంతంలో కలుసుకోని నెక్కోండ వెళ్ళి తిరిగి ఆటోలో వచ్చే క్రమంలో మరోమారు ఆటో ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులను బెదిరించి చోరీచేసేందుకు నిందితులందరు మూడు ఆటోల్లో వస్తున్నట్లుగా పక్కా సమాచారం రావడంతో ఈస్ట్‌జోన్ డి.సి.పి నాగరాజు, మామునూర్ ఎ.సి.పి శ్యాం సుందర్ ఆదేశాల మేరకు సి.సి.ఎస్ ఇన్స్‌స్పెక్టర్ డేవిడ్ రాజు, పర్వతగిరి ఇన్స్‌స్పెక్టర్ శ్రీధర్ రావు, తమ సిబ్బందితో కల్సి పర్వతగిరి నుండి నెక్కోండ పోయే మార్గంలో వాహనాలు తనిఖీ చేసే సమయంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోని పంచుల సమక్షంలో విచారించగా నిందితులు పాల్పడిన దారిదోపిడిలు, బందిపోటు చోరీలను పోలీసుల ఎదుట అంగీకరించారు.
నిందితులను గుర్తించడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డి.సి.పితో పాటు మామూనూర్ ఎ.సి.పి శ్యాంసుందర్, సి.సి.ఎస్, పర్వతగిరి ఇన్స్‌స్పెక్టర్లు డేవిడ్ రాజు, శ్రీధర్‌రావు, అసిస్టెంట్ అనాలటిక్ ఆఫీసర్ సల్మాన్,పర్వతగిరి ఎస్.ఐ వీరేందర్, సి.సి.ఎస్ ఎ.ఎస్.ఐ శ్రీనివాసరాజు, హెడ్‌కానిస్టేబుళ్ళు రవికుమార్, జంపయ్య, కానిస్టేబుళ్ళు మహమ్మద్ ఆలీ (మున్నా), నజీరుద్దీన్‌లతో పాటు నెక్కోండ ప్రధాన మార్గంలో ప్రజల భాగస్వామ్యంతో నెలకోల్పడబడిన సి.సి కెమెరాల దృష్యాల అధారంగా నిందితులను గుర్తించడం జరగడంతో నెక్కోండ మండల కేంద్రంలో సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసిన నెక్కోండ సి.సి కెమెరాల కమిటీను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.వి.రవీందర్, ఈస్ట్‌జోన్ డి.సి.పి నాగరాజు అభినందించారు.
ఈస్ట్‌జోన్ డి.సి.పి కార్యాలయము