ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు.. 7నెలలపాటు, 13ఏళ్ల బాలికను

ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు.. 7నెలలపాటు, 13ఏళ్ల బాలికను పాఠశాలలో ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లు మరో 15మంది విద్యార్థులు రేప్ చేశారు.

మొదట్లో అమ్మాయిపై అత్యాచారం చేసిన విద్యార్థి దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి మిగిలిన విద్యార్థుల చేత కూడా ఆ అమ్మాయిపై అత్యాచారం చేయించారు. ఈ అఘాయిత్యం భరించలేక అమ్మాయి ప్రిన్సిపల్ కి చెప్పుకుంటే అతడు కూడా మరో ఇద్దరు టీచర్లతో కలసి అమ్మాయిపై వరుసగా అత్యాచారం చేయడం మొదలు పెట్టాడు.

తండ్రి ఒక నేరంలో జైలుకి పోయి ఉండటం 7నెలల తర్వాత ఆ తండ్రి జైలునుంచి విడుదలై వచ్చి తన కూతురుపై జరుగుతున్న వరుస అత్యాచారాలు తెలుసుకున్నాడు. పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఆ కళాశాల ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లు, ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. మిగిలిన 12మంది విద్యార్థులు పరారీలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here