పోటీ పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబర్చి వీఆర్వో, పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగాలు సాధించి ఓ యువకుడు ఆదర్శంగా నిలిచాడు. కమలాపూర్‌ మండలంలోని శంభునిపల్లి గ్రామానికి చెందిన మోడెం సాయిప్రసన్న కుమార్‌ రెండు ఉద్యోగాలు సాధించాడు. మోడెం తిరుపతి-రమాదేవి దంపతుల పెద్దకుమారుడు సాయి ప్రసన్న కుమార్‌ కొండగట్టు జెఎన్‌టీయూ క్యాంపస్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం సాయి ప్రసన్న కుమార్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్నాడు. ఉన్నత చదువులు చదువుతూనే ఇటీవల జరిగిన వీఆర్వో, పంచాయతీ సెక్రెటరీ పరీక్షలు రాసి ఉన్నత ర్యాంకులు సాధించాడు.

వీఆర్వో ఫలితాల్లో సాయిప్రసన్న కుమార్‌ రాష్ట్ర స్థాయిలో 13వ ర్యాంకు, వరంగల్‌ జిల్లాలో 3వ ర్యాంకు సాధించాడు. తాజాగా ప్రకటించినా పంచాయితీ కార్యదర్శి ఉద్యోగానికి సైతం ఎంపికయ్యాడు. రెండు ఉద్యోగాలు సాధించిన సాయి ప్రసన్న కుమార్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.