తెలుగులో సంగీత చేసిన చెప్పుకోదగిన సినిమాల్లో ‘ఖడ్గం’ ముందువరుసలో కనిపిస్తుంది. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ‘ఖడ్గం’ సినిమాను గురించి సంగీత ప్రస్తావించారు. ‘ఖడ్గం’ సినిమాలో నేను చెప్పిన ‘ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్’ అనే డైలాగ్ చాలా పాప్యులర్ అయింది. ఆ డైలాగ్ అంతగా జనంలోకి వెళ్లడానికి కారణం .. నా మనసు లోతుల్లో నుంచి ఆ డైలాగ్ రావడమే .. అంత సహజంగా ఆ డైలాగ్ నేను చెప్పడానికి కారణం, అప్పుడు నా కెరియర్ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండటమే. ఈ సినిమాకి ముందు ఇతర భాషల్లో నేను చేస్తూ వచ్చిన అన్ని సినిమాలు పరాజయంపాలవుతూ వచ్చాయి. కృష్ణవంశీ గారు ఈ పాత్రను గురించి చెబుతున్నప్పుడు .. ఈ సినిమాను తెరపై చూస్తున్నప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి ఇదే కదా అని అనుకునేదాన్ని” అని చెప్పుకొచ్చారు.