ఒక రాత్రి పడుకుంటే రేటేంతో చెప్పమని వేధిస్తున్నారన్న యువ గాయని


సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ బయటపెట్టినందుకు తనను అనేక రకాలుగా వేధిస్తున్నారని గాయని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో నీతి నిజాయితీకి విలువలేదన్నారు. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి అవహేళనలు, అవమానాలు చేస్తున్నారని చిన్మయి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన లిటరరీ ఫెస్టివల్ లో చిన్మయి పాల్గొన్నారు. ఆమె ఇంకా ఏం అన్నారంటే…

“సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను బయటపెట్టినందుకు తనకు అవకాశాలు రాకుండా చేశారు. నన్ను డబ్బింగ్ యూనియన్ నుంచి బహిష్కరించారు. గేయ రచయిత వైరముత్తు మాత్రం గొప్ప వ్యక్తిగా చలామణీ అవుతున్నారు. వైరముత్తు నన్ను లైంగికంగా వేదించాడు. భారత సమాజంలో బాధితురాలికి న్యాయం జరగడం అంత సులభం కాదు. అండగా నిలవాల్సింది పోయి వేధిస్తున్నారు. బాధితురాలి చనిపోతే లేక హత్యకు గురైతే మాత్రం స్పందిస్తారు.

నేను సోషల్ మీడియా నుంచి అనేక అవమానాలు ఎదుర్కొంటున్నాను. ఒక నైట్ పడుకుంటే ఎంత తీసుకుంటావు, నీ రేటెంత ,గంటకెంత, నైట్ కెంత అని పిచ్చి పిచ్చి గా కామెంట్స్ చేస్తున్నారు. నన్ను ఒక వ్యభిచారిణిగా చూస్తున్నారు.

నేను ఇప్పటి వరకు 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఐదు రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నాను. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా తనకు మంచి గాయనిగా పేరుందని అటువంటప్పుడు సంచలనాల కోసం ఎందుకు ఆరోపణలు చేస్తాను. అయినా నేను చేసిన ఆరోపలణలు సంచలనాలకు వాడుకునేలా ఉన్నాయి. అమ్మాయిల పైనే కాదు చిన్న వయసు అబ్బాయిల పైనా అత్యాచారాలు జరుగుతున్నాయి.

రాజకీయ పలుకుబడితో చాలా మంది దోషులు తప్పించుకొని తిరుగుతున్నారు. వైరముత్తు పుస్తకావిష్కరణలో తమిళనాడు సీఎం పళని స్వామి పాల్గొన్నారు. నేరారోపణ ఉన్న వారి కార్యక్రమాలకు నాయకులు వెళితే ప్రజలకు ఎలాంటి సంకేతాలు గమనించాలి. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడు. నేను లొంగకపోవడంతో నాకు అవకాశాలు రాకుండా చేశాడు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చి అనేక మంది అమ్మాయిలు తమ ఒళ్లును అప్పజెప్పారు. చీకటి రాత్రులలో నలిగిపోయారు. అవకాశాల కోసం చివరకు ముసలివాళ్ల దగ్గర కూడా పడుకునేవారు. ఇవన్నీ చూసినా అప్పుడు వారి బలం ముందు నేను నోరు విప్పే దైర్యం చేయలేకపోయాను. నా భర్త రాహుల్ రవీంద్రన్ సాయం వల్లే తాను సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల పై దైర్యంగా మాట్లాడుతున్నాను” అని చిన్మయి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here