పట్టణం లోని జి.కే.ఆర్ గార్డెన్ లో జరిగిన 9వ జాతీయ ఓటరు దినోత్సవంలో జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.పి. గారు మాట్లాడుతూ…. 18 ఏండ్లు నిండిన యువత ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అలాగే ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో 18 ఏండ్లు నిండిన యువత ప్రతి ఒక్కరు ఓటు యొక్క ప్రాదాన్యతను తెలుసుకుని తమ పేరును నమోదు చేసుకోవాలని, ఎన్నికల సమయయంలో తమ ఓటును వినియోగించుకుని ఓట్ల శాతాన్ని పెంచాలన్నారు, అలా చేయడం వళ్ళ రాష్ట్ర,కేంద్రల నుండి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా తమ ప్రాంతాని అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపినారు.
ప్రాజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో కీలకమని గుర్తుచేసారు. మరియు ఓటు వజ్రాయుధమని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని మరియు ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీకు నచ్చిన వ్యక్తి కి ఓటు వేయాలని తెలిపినారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించినారు. అదేవిదంగా నూతనంగా ఓటు నమోదు చేసుకున్న యువతకు ఓటర్ ఐడి కార్డులు అందించి వారికి ఓటు యొక్క ప్రాదాన్యతను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీ.ధర్మారెడ్డి గారు మరియు ఉన్నతాదికారులు, విద్యార్థులు, పాల్గొన్నారు.