కామారంకు చెందిన పాయం సత్యనారాయణ (38) గత కొంతకాలంగా గోవిందరావుపేట మండలం పస్రాలోనివాసముంటున్నాడు. ఆతని భార్య అదే మండలంలోని కర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అయితే కామారంలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు హాజరైన సత్యనారాయణ ఫలితాలు వెలువడిన తర్వాత తన ద్విచక్రవాహనంపై తిరుగుముఖం పట్టాడు.
Advertisement
ఈ క్రమంలో లవ్వాల బస్ స్టేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై ఇంకా కేసు నమోదు చేయలేదని ఎస్సై రవీందర్ తెలిపారు.