చారిత్రక వరంగల్ నగరానికి తలమానిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

Advertisement

భద్రకాళి బండ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

బల్దియా కమిషనర్ వీపీ గౌతమ్‌తో కలిసి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ భద్రకాళి బండ్, జైన్ గుట్టలు, స్మార్ట్‌రోడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రకాళి బండ్‌ను చారిత్రక వరంగల్ నగరానికి తలమానిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. బండ్‌పై నిర్మాణాలు చేస్తున్నక్రమంలో బండ్ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని దీనిపై నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. నగరంలో హృదయ్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అక్కడి నుంచి జైన్ గుట్ట అభివృద్ధిని పరిశీలించారు. నూతనంగా నిర్మించిన మెట్లద్వారా ఆయన గుట్టపై ఉన్న జైన్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. గుట్టపై జైన్‌కు సంబంధించిన చరిత్రను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పైలాన్ ఏర్పాటు చేయాలన్నారు. మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని అన్నారు.